మీ ఆశీర్వాదం కావాలి | CM Revanth Reddy
నేనేమి మనులు, మాణిక్యాలు అడగడం లేదు
మేడారానికి జాతీయ హోదా కల్పించాలి
కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందుకు కృషి చేయాలి
జాతర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటుదాం..
వెయ్యేళ్లు శాశ్వతంగా ఉండేలా గ్రానైట్ తో నిర్మిద్దాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన
కోట్లాదిమంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కుంభమేళా తరహాలో జాతీయ హోదా కల్పించి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అందుకు రాష్ట్రం నుంచి ప్రాముఖ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలన్నారు. పునర్నిర్మాణంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,...