ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. చిక్కుకున్న కార్మికులు వీళ్లే!
వరంగల్ వాయిస్, నాగర్ కర్నూలు: నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పై కప్పు కూలడంతో అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వివరాలను ప్రకటించింది. సొరంగంలో జర్విసింగ్ (పంజాబ్), సన్నీసింగ్ (జమ్ముకశ్మీర్), మనోజ్ దోబే (యూపీ), శ్రీనివాసులు, సందీప్, సంతోష్ జట్కా ఇరాన్ చిక్కుకున్నట్లుగా తెలిపింది. వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది వెతుకుతున్నారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన పలువురు కార్మికులను ఈగలపెంట జెన్‌కో ఆస్పత్రికి తరలించారు.
శనివారం ఉదయం ఎడవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా టన్నెల్ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో ముగ్గురు కార్...
