Warangalvoice

Tag: Reporter Narada – Lokalyanardham

రిపోర్టర్ నారద – లోకకళ్యాణార్ధం
Cultural, Today_banner

రిపోర్టర్ నారద – లోకకళ్యాణార్ధం

దేవర్షి నారద జయంతి  పాత్రికేయులకు ఆది పురుషుడు నారద మహాముని  ‘వార్తయందు జగము వర్ధిలులచున్నది యదియు లేని నాడ యఖిలజనులు సంధకార మగ్నులగుదురు గాన వార్త నిర్వహింపవలయుజతికి’ అంటాడు నారదుడు. వార్త అంటే సమాచారమనీ నాటి అభిప్రాయం. వార్త అంటే సమాచారం, సమాచరమే విజ్ఞానం. సమాచరమే అధికారం. సమాచారం అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇటు సమాచార రంగానికి, అటు పాత్రికేయులకు ఆది పురుషుడు నారద మహాముని ఆయన సమాచారాన్ని లోక కల్యాణానికి ఉపయోగించారు. రాజసూయానికి ముందు ధర్మరాజు వద్దకు వస్తాడు నారదుడు. ధర్మరాజు రాజనీతిని బోధిస్తూ ఒక పద్యాన్ని ఉదహరిస్తాడు. ఇది ఆంధ్ర మహాభారతం సభా పర్వంలో ఉంది. పై పద్యం ఈనాటి అభిప్రాయ వార్త నిర్వహింప వలయు జతికి అంటే ఇక్కడ అర్థం రాజుకు వార్త చేరవేయాలని. ప్రజాస్వామ్యంలో సిద్ధాంతరీత్య ‘అధిపతి’ అంటే ప్రజలు కనుక ప్రజలకు వార్త అందించాలని ఆ పద్యాన్ని ఈనాటికి అన్వయించుకోవచ్చు. మరొక వైపు ప్రజాస్...