ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే
ఆదానీ, మోడీ బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా
ఆదానీ షెల్ కంపెనీలకు కోటాది రూపాయులు ఎలా వచ్చాయి
చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి
లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు
అనర్హత వేటు తర్వాత తొలిసారిగా విూడియా ముందుకురాహుల్
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: అదానీ షెల్ కంపెనీలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలాగే ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి కూడా వెనకాడనని అన్నారు. అదానీ వ్యవహారాన్ని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ గాంధీ చెప్పారు. అనర్హత వేటు వేసినా..జైల్లో వేసినా..కొట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అదానీ ఇష్యూను డైవర్ట్ చేయడానికే తనపై అనర్హత వేటు వేశారని చెప్పారు. అనర్హత వేటు తర్వాత తొలిసారిగా విూడియా ముందుకు వచ్చిన ఆయన..అదానీ కంపెనీల్లో ఎవరు పెట్టుబడి పెట్టారో చెప్పాలన్నారు. అదానీ కంపెనీలో పెట్టుబడ...