తెలంగాణలో వేగవంతమైన ప్రగతి
కెసిఆర్ జాతీయ రాజకీయాలపై సానుకూలత
ప్రత్యామ్నాయ రాజకీయాలపై ప్రజల్లో ఆసక్తి
వరంగల్ వాయిస్,హైదరాబాద్:
దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత విధానంలో ముందుకు సాగితే మరో వందేళ్లయినా అభివృద్ధి సాధించమన్న ప్రకటన ఆలోచింపచేసేదిగా ఉంది. తాజా బడ్జెట్ చూస్తుంటే కెసిఆర్ ప్రకటన అక్షరాల నూటికి నూరుపాళ్లు నిజం. నిజానికి దేశాన్ని..ఇతర రాష్టాల్రను పోల్చిచూస్తే తెలంగాణలో తెలంగాణలో వేగవంతమైన ప్రగతి కనిపిస్తుంది. సాగునీటి రంగంతో పాటు విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పలు చూస్తున్నాం. పాఠశాలల గతిని మారుస్తున్నారు. దేశానికి కొత్త తరహా రాజకీయం అవసరమని.. ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా సానుకూలత వ్యక్తం అవుతోంది. నిజానికి 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత కూడా మన రాజ్యాంగం ద్వారా పేదలు, అతిపేదలు, ప్రజలకు మేలు కలగడం లేదు. కేవలం రాజకీయ వ్యవస్థమాత్రమే బలోప...