Warangalvoice

Tag: Rahul participated in Parliament meetings

పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొన్న రాహుల్‌
Political, Today_banner

పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొన్న రాహుల్‌

సూరత్‌ కోర్టు తీర్పు తరవాత పార్లమెంట్‌కు హాజరు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: సూరత్‌ కోర్టు తీర్పు అనంతరం రాహుల్‌ శుక్రవారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఉదయం పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్‌ హాజరయ్యారు. అనంతరం లోక్‌సభ ప్రారంభం కాగానే ఆ సమావేశం లోనూ పాల్గొన్నారు. కోర్టు తీర్పుతో రాహుల్‌పై అనర్హత వేటు పడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత , ఎంపీ రాహుల్‌ గాంధీ కి గుజరాత్‌ లోని సూరత్‌ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ’దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..?’ ఆయన ప్ర...