అనివార్యమైన జీవుడి జనన మరణాలకు అవి సంకేతాలు
రథసప్తమి జనవరి 28న
సూర్యుడుదయించే తూర్పు దిక్కు అస్తమించే పడమటి దిక్కు రెండూ వందనీయాలు.కోటి సూర్యమండల మధ్యస్థమైన మహాత్రిపురసుందరీదేవి తన మూల స్థానాన్ని సూర్యుడియందే నిలుపుకున్నది. అంటే సౌరశక్తి అనంతశక్తి భాండాగారం. ఇంతటి పౌరాణిక, వైజ్ఞాజనిక ప్రాభవంతో వెలుగుతూ సృష్టి మొత్తాన్ని వెలిగించేది. కనుకనే రథసప్తమి పర్వదినమైంది. మాఘ సప్తమి తిథి నుండి సూర్య కిరణాలు వేడిని, వెలుగును, శక్తినీ, ధాతుపుష్టినీ మరింత సమృద్ధం చేసుకొని ప్రకృతికి పచ్చదనాన్ని, జీవులకు అంతరంగ దర్శనాన్ని వైజ్ఞానికులకు అన్వేషణా తీవ్రతను జాతి, మత, వర్గ, వర్ణనాతీతమైన స్థాయిలో ప్రసరించే రథసప్తమి, సూర్యోపాసనలో ఒక మహత్తరమైన భూమిక. ఈ క్షణం నుండీ జీవుడి ప్రయాణాన్ని వడి వడిగా సాగించే మహాబోధక శక్తి అనుభవమౌతుంది. అవిద్య, అనాచారం, అస్పష్టత, అహంకారం అనబడే చీకటిని నశింపజేసే వినాశక శక్తీ, దేహ, మనో బుద్ధులను వికాసమానం చేయగల శక్తి సూర్య కిరణాల...