రాజకీయాల్లో అపర చాణక్యుడు పీవీ ….
జూన్ 28న జయంతి
రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పీవీకి పేరుంది. పదవిని చేపట్టినా అది ప్రజల పక్షంగానే నడిపించింది. తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం ఆయన సొంతూరు. రుక్మిణి, సీతారామారావు తల్లిదండ్రులు. 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. పీవీ ప్రాథమిక విద్య వంగర, హన్మకొండలో సాగింది. 1936లో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులయ్యారు. 1938లో నిజాం వ్యతిరేక పోరాటంలో పీవీ పాల్గొన్నారు. దీంతో ఆనాడు రాష్ర్టంలో ఎక్కడ చదవకుండా ప్రభుత్వం నిర్భంధం విధించింది. చదువుపై మమకారంతో మహారాష్ర్టలోని పూణేలో బీఎస్సీ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన పీవీ హైదరాబాద్ రాష్ర్ట ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటు ప్రత్యేక మ...