Kaleshwaram Canal : భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ధర్నా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు.
వరంగల్ వాయిస్, రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్దార్ కార్యాలయం ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం మాట్లాడుతూ.. సేకరించిన రైతుల భూములు ధరణి నుంచి తొలగిపోయి రైతు భరోసా కూడా రాక రైతులు తీవ్రంగా నష్ట పోతున్నట్లు తెలిపారు.
పరిహారం చెల్లించకుండానే ధరణి ఆన్‌లైన్‌లో నుంచి రైతుల పేర్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ...
