Warangalvoice

Tag: Protection of government land with the initiative of BJP

బీజేపీ చొరవతో ప్రభుత్వ భూమికి రక్షణ
Top Stories

బీజేపీ చొరవతో ప్రభుత్వ భూమికి రక్షణ

వరంగల్ వాయిస్, పరకాల : పట్టణంలోని నూతన వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 95లో గల సుమారు1500 గజాల ప్రభుత్వ భూమి అన్యాకాంతం కాకుండా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వానికి,నూతన ప్రభుత్వానికి స్థానిక తహసీల్దార్, ఆర్డీవోలకు మెమోరాండం ఇచ్చి నిరసన తెలపడంతో అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడినందుకు పరకాల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ భూమిని ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని, ఇందుకోసం తగిన చొరవ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ప్రభారి దేవనూరి మేఘనాథ్, పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు మార్త భిక్షపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య, ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్, మాజీ పట్టణ అధ్యక్షుడు కానుగుల గోపి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి, 36వ బూత్ అధ్యక్షుడు...