ధరలు తగ్గించాల్సిందే..
పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలి
బీజేపీ, టీఆర్ ఎస్ దొందుదొందే
కాంగ్రెస్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా
వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నిత్యావసర, పెట్రో, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ , హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను, గ్యాస్ ధరలను తగ్గించాలని ఉప్పులు, పప్పులపై, పాలపై విధించిన జీఎస్టీని వేసి పేదల నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాలు వెంటనే అధిక ధరలను, తగ్గించి జీఎస్టీని ఎత్తివేయాలని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిరాశ్రయులైన వరద బ...