Old City | నివురుగప్పిన నిప్పులా పాతనగరం.. భారీగా పోలీసులు మోహరింపు
వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
వరంగల్ వాయిస్, చార్మినార్ : వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి భవన్‌కు చేరిన పక్షంలో ఇక రాజ్యాంగబద్దంగా అమలు కావడమే తరువాయి. ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మెజారిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేసి బిల్లు సవరణకు మద్దతు పలికారు. ఈ క్రమంలో ముస్లింలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్వాగతిస్తే.. మరికొందరు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఈ క్రమంలో పాతనగరంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పుల కొనసాగుతుంది. శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల నేపథ్యంలో సున్నిత, అతి సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల పోలీస్ ఉన్నతధికారులు ప...