BRS leaders | కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేటీఆర్, హరీష్‌రావు ఇళ్లవద్ద పోలీసుల మోహరింపు
కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతల నివాసాల వద్ద పోలీసులు మోహరించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతల నివాసాల వద్ద పోలీసులు మోహరించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు.
ఇదిలావుంటే హెచ్‌సీయూ వద్ద ఆందోళనకు దిగిన బీజేవైఎం, సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చికోటి ప్రవీణ్ సహా పలువురు నేతలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. పరిస్థితి అదుపుతప్పకుండా హెచ్‌సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
హైకోర్టులో పిల్..
కాగా కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్ దాఖలైంది. కంచ గచ్చిబౌలి భూములను జా...