గిరిజన ఆదివాసీ జీవితాల్లో వెలుగులు
పోడు పట్టాలతో పాటు పోడు కేసుల ఎత్తివేత
ఇకముందు వారిపై ఎలాంటి కేసులూ ఉండవు
ఆసిఫాబాద్ జిల్లాల్లోనే 47వేల ఎకరాలకు పోడు పట్టాలు
పోడు పట్టాలతో పాటు రైతుబంధు కూడా అమలు
ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీ ఫేజ్ కరెంట్‌కు ఆదేశాలు
కౌటాలా వార్ధా మధ్య బ్రిడ్జికి 75 కోట్లు మంజూరు
ఆసిఫాబాద్ వేదికగా సిఎం కెసిఆర్ ప్రకటన
వరంగల్ వాయిస్ , కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ : గిరిజనులకు పోడు పట్టాలు అందించడంతో పాటు వారికి మరో శుభవార్తను కెసిఆర్ అందించారు. పోడుభూములకు సంబంధించి ఆదివాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక వారిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. పట్టాలు పంపిణీ చేసిన అనంతరం కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత పేదల బతుకుల గురించి ఆలోచించి చాలా కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. తెలంగా...