Warangalvoice

Tag: PD act against three ganjai smugglers

ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్
Crime, District News, Mulugu

ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్

క్రయవిక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలుయువతకు మత్తు వ్యసనాలకు బానిస కావొద్దువరంగల్ సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, పరకాల: పరకాల పోలీస్ స్టేషన్ పరధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ములుగు జిల్లా వెంకటపురం మండలం లక్ష్మీ దేవి పేట్ చెందిన కమ్మగాని రాంమూర్తి, కమ్మగాని చందుతో పాటు జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన బొల్లికొండ రాజయ్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను గురువారం పరకాల ఇన్ స్పెక్టర్ పి.కిషన్ నిందితులకు ఖమ్మం జిల్లా కారాగారంలో అందజేసి వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీయాక్ట్ అందుకున్న నిందితులు రెండు నెలల క్రితం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రా నుంచి భద్రాచలం మీదుగా పరకాలకు గ...