ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తిపై పీడీయాక్ట్
వరంగల్ వాయిస్, క్రైం: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాటు ఉద్యోగాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగుల వద్ద డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న గుంటూరు జిల్లా పట్టాబిపురానికి చెందిన ఎస్.కె.గౌస్, పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్ నిందితుడు గౌస్ కు వరంగల్ రైల్వే స్టేషన్లో వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసి చర్లపల్లి కారాగారానికి తరలించారు.పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులను నమ్మించడం ప్రారంభించి.. సంబంధిత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు రూ.8లక్షల నుంచి 20 లక్షల్లో డబ్బు వసూలు చేసిన సంఘటనలో నిందితుడిని మీల్స్ కాలనీ, టాస...
