Pavan Kalyan | కోటి రూపాయలు అడిగినా ఇస్తాను, కాని అవి మాత్రం ఇవ్వను
వరంగల్ వాయిస్, సినిమా : విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ బుక్ ఫెస్టివల్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ బుక్ ఫెస్టివల్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనవరి 2న సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. 234 స్టాళ్లతో అనేకమంది ప్రచురణకర్తలు ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు. సాహితీ నవజీవన్ బుక్ లింక్స్ అధినేత పిడికిలి రామకోటేశ్వరరావు పేరును ఈ బుక్ ఫెస్టివల్ ప్రాంగణానికి పెట్టారు. ప్రధాన సాహితీవేదికకు ఈనాడు అధినేత దివంగత రామోజీరావు పేరు పెట్టారు. విద్యార్థుల కార్యక్రమాలు జరిగే ప్రతిభా వేదికకు దివంగత పారిశ్రామిక వేత్త రతన్ టాటాపేరు పెట్టారు. ఈ పుస్తక మహోత్సవం 2వ తేదీనుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. అయితే ఈ బుక్ ఫెస్టివల్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కోటి రూపాయలు అయిన ఇవ్వడానికి వెనుకాడను కానీ నా దగ్గర పుస్తకాలు ఉన్న ఇవ్వడానికి ఆలోచిస్తాను. పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదను ఇచ్చినట్లే అన...