Warangalvoice

Tag: Partha Saradi

తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు
Telangana, Today_banner, Top Stories

తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథిఎస్సెస్సీ టాపర్లకు అవార్డుల ప్రదానం వరంగల్ వాయిస్, నిజామాబాద్ : తెలివితేటలు ఏ ఒక్కరికే సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి పేర్కొన్నారు. తెలివితేటలకు కుల, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం చిట్ల ప్రమీల, జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి యేటా నిర్వహిస్తున్న ఆనవాయితీని పాటిస్తూ ‘ విద్యా స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ పట్టణంలోకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి,...
కాలంతో పోటీపడు.. కొలువుతో నిలబడు
Telangana, Today_banner

కాలంతో పోటీపడు.. కొలువుతో నిలబడు

కష్టంతో కాదు.. ఇష్టపడి చదవాలిసమయ పాలన, పక్కా ప్రణాళిక అవసరంఅలుపెరుగని శ్రమతో విజయం సాధ్యంగ్రూప్‌ -1 సాధిస్తే జీవితమే మారిపోతుందిరాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథిఖమ్మంలో ఉద్యోగార్థులకు ప్రేరణ తరగతులు ‘‘ప్రతీ ఒక్కరిలో తనకు తెలియని శక్తి సామర్థ్యాలు ఎన్నో ఉంటాయి.. వాటిని బయటకు తీసి సరైన సమయంలో వినియోగించుకున్నప్పుడే మనిషి జీవితానికి సార్థకత.. నిరాశ, నిస్పృహలు వద్దు.. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టం కాదు..’’ అని ఉద్యోగార్థులకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి సూచించారు. మంగళవారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్‌ పోటీపరీక్షలకు ప్రభుత్వ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆయన సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా వారిలో ప్రేరణ కలిగించారు. కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలని.. కొలువు సాధించేదాక విశ్రమించొద్దని పిల...