Warangalvoice

Tag: ##pamplements@@

“ఆరోగ్యదర్శి”ని వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ
District News, Hanamkonda, Telangana

“ఆరోగ్యదర్శి”ని వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఆరోగ్యదర్శిని 10వ వార్షికోత్సవ సంచికను, నూతన సంవత్సర క్యాలెండర్ ను హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ , వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్యదర్శిని పక్షపత్రిక పదేళ్లుగా నిర్విరామంగా వెలువరించడం అభినందనీయమన్నారు. అలాగే ఉచిత హోమియో క్యాంపులు నిర్వర్తిస్తూ ప్రజలకు హోమియోపతిపై అవగాహన కల్పించడంలో విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ ఒకవైపు వైద్యం చేస్తూనే మరొకవైపు ఆరోగ్య దర్షిని పక్షపత...