Fake Cirtificate | దొంగ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగం
విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలి
కలెక్టర్ కు లంబాడి హక్కుల పోరాట సంఘం వినతి
వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎస్టీ లంబాడి కులం పేరుతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ ఉద్యోగిగా చలామణి అవుతున్న గోపు స్వర్ణలతపై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర వెంకట్ నాయక్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవేండి గ్రామానికి చెందిన గోపు బాలశౌర్ రెడ్డి 1963 లో కడవేండి చర్చిలో గోపు సుశీలను వివాహం చేసుకున్నారు. వారికి హేమలత, స్వర్ణలత ఇద్దరు కూతుర్లు. గోపు సుశీల వ్యక్తిగత కారణాలతో ఇద్దరు కూతుర్లతో ఖాజిపేటకు వచ్చి ఫాతిమా నగర్ లో కిరాయి ఉంటూ జీవనం సాగిస్తోంది. అనంతరం గోపు సుశీల భూక్యా అంకుష్ వీధిలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటూ ఆయనతో స్నేహ...