OU Circular | ఓయూ సర్క్యులర్ రద్దుకు మద్దతు ఇవ్వండి.. ప్రొఫెసర్ హరగోపాల్‌కు విజ్ఞప్తి
ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని విద్యార్థి నేతలు విజ్ఞప్తి చేశారు.
వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని విద్యార్థి నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్‌లను కలిసి పరిస్థితిని వివరించారు.
అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా జారీ చేసిన సర్క్యులర్‌ను తక్షణమే ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వం.. ఓయూ అధికారులతో మాట్లాడాలని ...
