ఊరూ..వాడా.. సీతారాముల కల్యాణ శోభ
కన్నుల పండువగా వేడుకలు
వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
వరంగల్ వాయిస్, వరంగల్ : సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను బుధవారం ఎస్ ఆర్ ఆర్ తోటలోని శ్రీ వీరాంజనేయ దేవాలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ తంతు నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ కల్యాణోత్సవంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు వీలుగా ఎల్ ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. వివాహనంతరం భక్తులకు ఆశీర్వచనం నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. భక్తులకు బెల్లం పానకం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదానం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా 32వ డివిజన్ పరిధిలో ఆటో స్టాండ్ ఏరియాలోని శ్రీ వీరాంజనేయ దేవాలయం, వినాయక కాలనీలో జరిగిన కల్యాణ మహోత్సవంలో స్థానిక కార్పొరేటర్ పల్లం పద్మ రవి వాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహి...