Warangalvoice

Tag: Once again Congress mark fraud

మరోసారి కాంగ్రెస్ మార్క్ మోసం
Top Stories

మరోసారి కాంగ్రెస్ మార్క్ మోసం

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ వాయిస్, తొర్రూరు : మోసపూరిత మాటలతో రైతులను ఆగం చేస్తూ పరిపాలన చేతకాక కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకుపడ్డారు. తొర్రూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రైతులు ఎంతైనా వడ్లు పండించుకోండి రూ. 500 బోనస్ ఇచ్చి కొనే బాధ్యత నాది అని సరిగ్గా నెల రోజుల క్రితం ఏప్రిల్ 21న నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత సన్న వడ్లు పండించిన వారికి మాత్రమే రూ. 500 బోనస్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. తెలంగాణలో 90 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు మాత్రమే సాగు చేస్తారు. కేవలం 10 శాతం మంది రైతులు...