హస్తిన వేదికగా లేచింది మహిళా లోకం
మహిళా రిజర్వేషన్లపై పిడికిలి బిగింపు
జంతర్‌మంతర్ వద్ద దీక్షను ప్రారంభించిన ఏచూరి
మహిళాబిల్లు చారిత్రక అవసరమన్న కవిత
వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వెళ్లడిరచారు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని కవిత అన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత ఢల్లీిలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఫీుభావం ప్రకటించారు. అంతకుముందు వేదిక వద్దకు చేరిన ఎమ్మెల్సీ కవ...