SLBC tunnel | కొనసాగుతున్న సహాయక చర్యలు.. టన్నెల్‌లోకి మరోసారి క్యాడవర్ డాగ్స్
దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.
వరంగల్ వాయిస్, అచ్చంపేట : దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. క్యాడవర్ డాగ్స్ మృతదేహాల ఆచూకిని గుర్తించడానికి మరోసారి లోపలికి వెళ్లాయి. రెస్క్యూ ఆపరేషన్ 34 వ రోజుకు చేరుకున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటిని నియమించింది. ఆయన ఇక్కడనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయన సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34 రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయక బృందాలు నిరంతరాయంగా కృషి చేస్తున్నాయని, రోజుకు మూడు షిఫ్టులుగా 600...
