న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు
కెసిఆర్ తనయ కవితకు ఇడి నోటీసులు
9న విచారణకు రావాలని ఆదేశాలు
15 తరవాత వస్తానంటూ కవిత లేఖ
కవితకు నోటీసులపై భగ్గుమన్న బిఆర్‌ఎస్ నేతలు
వరంగల్ వాయిస్,హైదరాబాద్: ఢల్లీి లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణకు 9న గురువారం హాజరు కావాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇడి లేఖ రాసింది. అయితే ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని వెంటనే కవిత కూడా బదులిచ్చారు. ఈ మేరకు
ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మార్చి 9న ఈడీ విచారణకు హాజరుకాలేనని లేఖలో తెలిపారు. ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10న ఢల్లీిలో జంతర్ మంతర్ వద్ద దీక్ష ఉన్నందున సమయం కావాలని కోరారు. ముందస్తు అపాయింట్‌మెంట్స్ ఉన్నందున.. విూరు చెప్పిన టైంలో విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేస్తూ.. ఈడీకి కవిత లేఖ రాశారు. ఈ లేఖకు ఈడీ ఎలాంటి సమాధానం ఇస్తుందనే ఆసక్తికరంగా మారింది. ...