journalist Revathi: మహిళా జర్నలిస్టుకు 14 రోజుల రిమాండ్.. సంచలనం రేపుతున్న ఘటన..
సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన మహిళా జర్నలిస్టుకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు జర్నలిస్టు రేవతిపాటు మరో మహిళను చంచల్ గూడ జైలుకు తరలించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మహిళా జర్నలిస్ట్ రేవతికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రేవతితోపాటు బండి సంధ్యను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. వారిద్దరికీ ఈనెల 26 వరకూ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. విచారణ సందర్భంగా రేవతి రిమాండ్‍ను రిజక్ట్ చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే ఉద్దేశపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారని, ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ న్యాయమూర్తి దృష్టికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకెళ్లారు. రేవతిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించారు. పీపీ వాదనలకు ఏకీభవించిన...