భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
ఆలయాల్లో భక్తుల రద్దీపుట్టలో పాలు పోసి మొక్కులుచల్లంగా చూడాలని ‘నాగన్న’కు పూజలు
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తి శ్రద్ధలతో పుట్టల్లో పాలు పోయడానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయాలను సుందరంగా అలంకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లోని పుట్టలకు, నాగమయ్యను పూజించడానికి భక్తులు తరలివచ్చారు. అభిషేకాలు, పాలు, పండ్లు, పసుపు కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్, ఉర్సు నాగమయ్య గుడికి భక్తులు బారులు తీరారు. తమ కుటుంబాన్ని చల్లంగా చూడాలని నాగమయ్యను వేడుకున్నారు.
దయానంద కాలనీలో..వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దయానంద కాలనీ శ్రీ కనకదుర్గ మాత దేవాలయం ఆవరణలోని నాగేంద్ర స్వామి దేవాలయంలో నాగుల పంచమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గ మాత ఆలయ కమిటీ చైర్మన్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ....