ఘనంగా నాగుల పంచమి
ఉర్సు నాగమయ్య గుడికి పోటెత్తిన భక్తులు
జిల్లా వ్యాప్తంగా వేడుకలు
వరంగల్ వాయిస్, కరీమాబాద్ : నాగుల పంచమి సందర్భంగా ఉర్సు నాగమయ్య గుడికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలి క్యూ కట్టారు. జంట నాగులకు పాలుపోసి భక్తి పారవశ్యలో మునిగితేలారు. కోరిన కోర్కెలు నెరవేర్చుతూ భక్తుల కొంగు భంగారంగా వెలుగొందుతున్న నాగమయ్య దర్శనానికి రెండు, మూడు గంటలపాటు క్యూలైన్లలోనే వేచి ఉన్నారు. భక్తుల రాకను ముందుగానే గుర్తించిన ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలరు. మిల్స్ కాలనీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలో..
నాగుల పంచమి సందర్భంగా నర్సంపేట్ రోడ్ లోని శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలోని నాగేంద్ర స్వామికి పాలు పోసి మొక్కులు సమర్పించుకున్నారు. కనకదుర్గ దేవాలయ కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ భక్తులకు ఎలాంటి అసౌ...