Warangalvoice

Tag: Nagarkurnool Kgbv Student Protest Against English Teacher Kalyani

KGBV | ఇంగ్లీష్ టీచ‌ర్ వేధిస్తోంది.. మండుటెండ‌లో కేజీబీవీ విద్యార్థినుల ధ‌ర్నా
District News

KGBV | ఇంగ్లీష్ టీచ‌ర్ వేధిస్తోంది.. మండుటెండ‌లో కేజీబీవీ విద్యార్థినుల ధ‌ర్నా

వరంగల్ వాయిస్,  నాగ‌ర్‌క‌ర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక 9వ త‌ర‌గ‌తి విద్యార్థిని త‌న‌ చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగ‌తి తెలిసిందే. పది రోజులైనా టీచర్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంగ్లీష్ టీచ‌ర్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో అధికారుల తీరును నిర‌సిస్తూ.. విద్యార్థినులు మ‌రోసారి మండుటెండ‌లో ధ‌ర్నా చేశారు. మేడమ్ మమ్మల్ని టార్చర్ చేస్తుంది, స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుంది, చదవకపోతే గొంతు పట్టుకొని పైకి లేపుతుంది అంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు మూడు గంటల నుంచి విద్యార్థినులు తరగతులను బహిష్కరించారు. ఇంగ్లీష్ టీచర్ కళ్యాణినీ సస్పెండ్ చేసే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో క్లాసుల్లోకి వెళ్ళమని, భోజ‌నం ముట్టుకోమ‌ని విద్యార్థినులు తేల్చిచెప్పారు....