Mukkoti Ekadashi | పవిత్ర ఉత్తర ద్వార దర్శనం ’ముక్కోటికి‘
వరంగల్ వాయిస్, కల్చరల్ : ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 10న వచ్చింది. ఆరోజు ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. అంతే కాదు దగ్గరలో పుణ్య నదులు ఉంటే వాటిలో స్నానమాచరిస్తారు. అలా చేస్తే కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఉత్తరాయణ పుణ్య కాలానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి రోజున వేకువజామునే లేచి, తలంటు స్నానం చేసి.. ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. హిందువులు ఆధ్యాత్మికమైన విషయాల్లో చాలా శ్రద్ద చూపుతారు. పండుగలకు.. విశేషమైన రోజులలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తుల కోర్కెలను తీరుస్...