మోగిన కర్నాటక ఎన్నికల నగారా
మే 10న ఒకే దశలో ఎన్నికల నిర్వహణ
మే 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాల ప్రకటన
ఏప్రిల్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 20వ తేదీ వరకు నామినేషన్లకు గడువు
80 ఏళ్ల పైబడ్డవారికి, వికాలంగులకు ఓట్ ఫ్రమ్ హోమ్
విూడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచిన సిఇసి రాజీవ్ కుమార్
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ:కర్నాటకలో ఎన్నికల నగారా మోగింది. 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ ప్లీనరీ హాలులో బుధవారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కర్ణా...
