ఇడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
పిడికిలి బిగించి అభివాదం చేసిన కవిత
విచారణ కొనసాగిస్తున్న ఇడి అధికారులు
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. పిడికిలి బిగించి మనదే విజయం అనే సంకేతం ఇస్తూ కవిత కార్యాలయం లోకి వెళ్లారు. కాగా, కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ నేతలు తుగ్లక్‌రోడ్డులోని నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో కవిత భేటీ అయ్యారు. గతరాత్రినుంచే వీరు అనేక అంశాలపైనా చర్చించారు. ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో కసరత్తు చేశారని సమాచారం. ఇదిలావుంటే ఈడీ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో.. ఆ ఆఫీస్‌లో కూర్చున్న తర్వాత కవిత ముఖంలో కనిపించిన ఆందోళన, భయానికి ...