MLC Kavitha | సంచార జాతులకు డీఎన్టీ సర్టిఫికెట్లు జారీ చేయాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
MLC Kavitha | సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల(డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల(డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ఈ జాతులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో సంచార జాతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సర్టిఫికెట్లు లేక పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొళ్ల శివ శంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంచార జాతుల సంఘం కోల శ్రీనివాస్ మంగళవారం నాడు ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను శాసన మండలిలో లేవనెత్తాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… సంచార జా...