MLC Kavitha | ఓయూలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
MLC Kavitha | జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు.
వరంగల్ వాయిస్, ఉస్మానియా యూనివర్సిటీ : జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మార్గదర్శకత్వంలో కవితక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్, నిరాహార దీక్షలు, సకల జనుల సమ్మె, రైలు రోకో, బతుకమ్మ పండుగ, సడక్ బంద్ తదితర ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలను చైతన్య పరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండు...
