ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి
ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి
వరంగల్ వాయిస్, ములుగు : ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సత్యాపాల్ రెడ్డి వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై పీఓలు, ఏపీఓలకు, ఓపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలు పీవోలు , ఏపీవోలు, ఓపీఓల పాత్ర కీలకంగా ఉంటుందని ఎన్నికల సంఘం విధివిధానాలపై అందరికీ అవగాహన ఉండాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఓటర్లు బ్యాలెట్ బాక్స్ లలో బ్యాలెట్ పేపర్ తో ఓటు వేస్త...