Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Danam Nagender | అసెంబ్లీలో సహచర ఎమ్మెల్యేల పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అమర్యాదగా ప్రవర్తించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : అసెంబ్లీలో సహచర ఎమ్మెల్యేల పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అమర్యాదగా ప్రవర్తించారు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల పట్ల సీరియస్ అయ్యారు దానం నాగేందర్. తాను సీనియర్ ఎమ్మెల్యేని, ఏం మాట్లాడాలో తనకు తెలుసని ఇతర ఎమ్మెల్యేల పట్ల దానం నాగేందర్ రుసరుసలాడారు.
ఏం మాట్లాడాలో తనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని దానం నాగేందర్ సూచించారు. అనేక సందర్భాల్లో క్యాంపు ఆఫీస్‌కి స్థలం కావాలని విజ్ఞప్తి చేశాను. తన విజ్ఞప్తిని పక్కన పెట్టి వేరే వేరే ఆఫీస్‌కు శంకుస్థాపన చేశారు. అందుకే శిలాఫలకం కూలగొట్టాను. ఈడబ్ల్యూఎస్ కాలనీని అక్రమంగా నిర్మించారు. జీహెచ్ఎంసీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పట్టించుకోవటం లేదు. సో...
