MLA Balu Naik | మంత్రి పదవికి నేను కూడా పోటీలో ఉన్నా : ఎమ్మెల్యే బాలు నాయక్
MLA Balu Naik | మంత్రి పదవిపై దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నోరు విప్పారు. తాను కూడా మంత్రి పదవికి పోటీలో ఉన్నానని బాలు నాయక్ పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : మంత్రి పదవిపై దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నోరు విప్పారు. తాను కూడా మంత్రి పదవికి పోటీలో ఉన్నానని బాలు నాయక్ పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో బాలు నాయక్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఇప్పటి వరకు తమ సామాజిక వర్గానికి చోటు లభించలేదు. కాంగ్రెస్ ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా కేబినెట్‌లో మా వాళ్లు లేరు అనే అసంతృప్తితో తమ సామాజికవర్గం వారు ఉన్నారు. కేసీఆర్ హయంలో మా సామాజిక వర్గానికి కేబినెట్‌లో స్థానం లభించింది. తమ సామాజిక వర్గానికి కేసీఆర్ ఎక్కడా అన్యాయం చేయలేదు.. అయినా కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు ఓట్లు వేశారు అని బాలు నాయక్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు...