Minister Konda Surekha: ఆ క్రెడిట్ వారు తీసుకున్న ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
Minister Konda Surekha: తెలంగాణ అభివృద్ది గురించి ఇక నుంచి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవాలని దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి చేస్తామని మాటలతో కోటలు కట్టింది కానీ తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఇవాళ(శనివారం) హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో కలిశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు కొండా సురేఖ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగులో ఉన్న రైల్వే పనులు చేయాల్సిన కార్యక్రమాల గురించి అరగంటకు పైగా తమతో చర్చించి సానుకూలంగా స్పందించారని అన్నారు. వరంగల్‌కు సంబంధించి తాము అడిగిన సమస్యలతో పాటు వరంగల్ రింగ్ రోడ్డుకు కృషి చేస్తామ...