Warangalvoice

Tag: Meo Satyanarayana Shetty Said That Quality Education Is Available In Government Schools

MEO | ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య : ఎంఈఓ సత్యనారాయణ శెట్టి
District News

MEO | ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య : ఎంఈఓ సత్యనారాయణ శెట్టి

వరంగల్ వాయిస్, తిమ్మాజిపేట : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంఈఓ సత్యనారాయణ శెట్టి అన్నారు. సోమవారం మండల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులకు ట్వినింగ్ కార్యక్రమంలో ద్వారా ఉన్నత పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య ప్రమాణాలు, సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి నైపుణ్యం కల అత్యున్నతమైన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన ఉంటుందన్నారు. విద్యార్థుల్లో జీవన ప్రమాణాలు పెంపొందించుట, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దామని ఎంఈఓ తెలిపారు. సామాజిక స్పృహ కేవలం ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, రఘు, రాంబాబు, మనోహర్, లక్ష్మయ...