వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి
ఎంపీ డాక్టర్ కడియం కావ్య
వరంగల్ వాయిస్, వరంగల్ : హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి" అని సీఐఐ తెలంగాణ ఇంటరాక్టివ్ సెషన్‌లో పార్లమెంటు సభ్యురాలు (లోక్‌సభ) డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరంగల్ నిట్ క్యాంపస్ లో శుక్రవారం సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మీటింగ్‌తో పాటుగా ఏఐ ఇన్ ఫార్మా: ది ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఇన్ ఫార్మాలో సీఐఐ మెంబర్‌షిప్ రోడ్ షో, సీఓఈల సేవలను నిర్వహించారు. వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది. ఇందులో పరిశ్రమలోని ముఖ్య నాయకులు వరంగల్‌పై తమ విజన్‌ను పంచుకున్నారు. సీఐఐ తెలంగాణ చైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సాయి డి ప్రసాద్ 'Ai in Pharma Session'లో స్వాగత ప్రసంగంలో తెలంగాణ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ, 2047 బి 1 ట్రిలియన్ USDఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే లక్ష్యాన్ని...