మహారాష్ట్ర వేదికగా బిజెపికి సవాల్
తెలంగాణ రైతు పథకాలపై చర్చకు ఆస్కారం
దమ్ముంటే అమలు చేయాలన్న కెసిఆర్
లోహా సభతో మరాఠ్వాడాలో బిఆర్‌ఎస్‌కు ఆదరణ
వరంగల్ వాయిస్,హైదరాబాద్: బిఆర్‌ఎస్ స్థాపించిన తరవాత మహారాష్ట్రలో కెసిఆర్ నిర్వహించి మలి సభ భారీ విజయం సాధించింది. దీంతో అక్కడి, ఇక్కడి బిఆర్‌ఎస్ నేతల్లో ఉత్సాహం నింపింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనా మహారాష్ట్రలో మెల్లగా అగ్గి రాజేయడం ద్వారా బిఆర్‌ఎస్ చర్చకు తెరలేపింది. అంతేగాకుండా మహారాష్ట్ర వేదికగా బిజెపికి సవాల్ విసిరినట్లు అయ్యింది. తెలంగాణ పతకాలను ప్రస్తావి స్తూ వాటిని అమలు చేసే దమ్ముందా అని కెసిఆర్ ప్రశ్నించారు. ఇది ఓ రకంగా బిజెపి పాలకులకు సవాల్ కానుంది. ప్రజల్లో చర్చకు రానుంది. కంధార్ లోహాలో ఆదివారం బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన రెండో సభతో ప్రత్యా మ్నాయం తామే అన్న చర్చకు తెరతీసారు.ప్రలోభాలను, పోలీసుల ఆంక్షల్ని దాటి అశేషంగా జనం తరలి రావడం వి...