అందుబాటులోకి లగ్జర్టీ బస్సులు
లాంఛనంగా ప్రారంభించిన పువ్వాడ
వరంగల్ వాయిస్,హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా ఆధునిక హంగులతో కూడిన 16 ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులకు ’లహరి` అమ్మఒడి అనుభూతి’గా ఆర్టీసీ నామకరణం చేసింది. సోమవారం ఈ కొత్త బస్సులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తదితరుల సమక్షంలో ఈ బస్సులను టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బళ్లిÑ ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతిÑ తమిళనాడులోని చెన్నై తదితర ప్రధాన మార్గాల్లో నూతన ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడపనుంది. 12 విూటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర...