స్థానిక ఎన్నికలకు బ్రేక్ | Local Elections Stay
ఉదయం నోటిఫికేషన్.. మధ్యాహ్నం స్టే
బీసీ రిజర్వేషన్ల జీవో 9పై వాదోపవాదనలు
నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
నాలుగు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశంవరంగల్ వాయిస్ ప్రతినిధి : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు లోకల్ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ ధాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా పిటిషనర్లకు రెండు వారాల సమయం ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.ఉదయం నోటిఫికేషన్..రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వ...