రైతులకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి
పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలి
ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచర్ల బాలరాజు
వరంగల్ వాయిస్, వరంగల్ : అఖిలభారత రైతుకూలీ సంఘం నర్సంపేట డివిజన్ కార్యవర్గ సమావేశం బుధవారం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు గట్టి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోటే రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి ఆచరించలేకపోయింది. పైగా, ఆగస్టు 15లోపు అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటికే రైతులు అప్పుల బారిన పడి బ్యాంకులిచ్చిన రుణాలకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో గత 40 సంవత్సరాలుగా గిరిజన గిరిజన పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారన...