బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కామ్
కెసిఆర్ బిడ్డకు తప్ప ఇతరులకు భద్రత ఏదీ
కవిత తీరుపై మండిపడ్డ వైఎస్ షర్మిల
ట్యాంక్‌బండ్‌పై రాణీరుద్రమ, చాకలి ఐలమ్మకు నివాళి
ఆకస్మిక ధర్నాతో ట్రాఫిక్ జామ్..అరెస్ట్ చేసిన పోలీసులు
వరంగల్ వాయిస్,హైదరాబాద్: కెసిఆర్ బంగారు తెలంగాణలో ఆయన కూతురు, ఎమ్మెల్సీ అయిన ఒకే ఒక్క మహిళకు రక్షణ ఉందని.. సీఎం కేసీఆర్ బిడ్డకే భద్రత ఉందని, మిగతా వారికి రక్షణ లేదని.. వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ముసుగులో లిక్కర్‌స్కామ్‌కు పాల్పడిరదని ఆరోపించారు. మహిళల విూద ఎంతో ప్రేమ ఉన్నట్లు మహిళా రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కవితకు తప్ప ఎవరికీ భద్రత లేదన్నారు. విచ్చలవిడి మద్యం వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని, దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ.. కవిత ఆడదై ఉండి సిగ్...