Laxman:రేవంత్ రెడ్డిను చూసి సమాజం తలదించుకుంటోంది
Laxman: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మోదీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్‌కు పట్టిన గతే.. రేవంత్‌కూ పడుతుందని మండిపడ్డారు. మోదీ తినే ఆహారాన్ని, వేసుకునే బట్టలను విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
వరంగల్ వాయిస్, సిద్దిపేట : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేటలో లక్ష్మణ్ పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మోదీ ఒక వర్గానికి, సమాజానికి చెందిన వారు కాదు.. ప్రజలందరి మనిషి. ప్రపంచ ఖ్యాతి కలిగిన వ్యక్తి అని తెలిపారు. మోదీపై గతంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇలాగే అవాకులు, చెవాకులు పేలారని అన్న...