సిన్సియారిటీ కేరాఫ్ సుందర్ రాజ్
విద్యావేత్త నుంచి కుడా చైర్మన్ దాక సుందర్ రాజ్ యాదవ్ విజయ ప్రస్థానంఉద్యమకారుడిగా, టీఆర్‌ఎస్ అధిష్ఠాన విధేయుడిగా పేరుఅందరితో కలివిడిగా.. పార్టీకి ట్రబుల్ షూటర్‌గా..చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కు కుడిభుజంగా ప్రసిద్ధిఅఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఘన సన్మానం
తెలంగాణ ఉద్యమ కారుడు.. విద్యా సంస్థల అధిపతి.. టీఆర్ఎస్ క్రియాశీల నాయకుడు.. ఈ మూడు విభిన్న రంగాలకు వంద శాతం న్యాయం చేసిన సమర్థత సుందర్ రాజ్ యాదవ్ సొంతం. ఓపిక, సహనం ఆభరణాలుగా, నిబద్ధత, నిజాయితీ పెట్టుబడిగా ఎదిగిన వినయశీలి. దశాబ్దకాలం ఎదురుచూపులకు కుడా చైర్మన్ పదవి రావడం.. ఉద్యమకారుడికి లభించిన సముచిత గౌరవం. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద కమ్యూనిటీల్లో ఒకటైన యాదవ కులానికి దక్కిన గుర్తింపు.. ఏప్రిల్ 7న బాధ్యతలు స్వీకరించిన సుందర్ రాజ్ యాదవ్ ను అఖిల భారత యాదవ మహాసభ ఘనంగా సన్మానించనుంది. 31న (రేపు) హనుమకొండ చింతగట్టు కేఎల్ఎన్ ఫంక్షన్ ...