KTR | కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనవద్దు.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక వెనక్కి తీసుకుంటాం : కేటీఆర్
పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్‌ని ఏర్పాటు చేసి హైదరాబాద్ ప్రజలు, హెచ్‌సీయూ విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్‌ని ఏర్పాటు చేసి హైదరాబాద్ ప్రజలు, హెచ్‌సీయూ విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా పార్టీ తరఫున ఓ మ...