KTR: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు.. కేటీఆర్ ఫైర్
KTR: కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. అసహాయ మంత్రులుగా మిగిలారని కేటీఆర్ విమర్శించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. కానీ రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం ఆ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోందని అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడకపోవడం బాధాకరంగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో కేటీఆర్ చర్చించారు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఆశ్చర్యమేస్తోందని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శి...